Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ప్రేమ పేరుతో మోసపోయిన గుడేపు మౌనిక కు సత్వర న్యాయమే ఎమ్మార్పీఎస్ పోరాటమని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ తెలిపారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్‌ను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ ములుగు మండలం ఇన్చార్జి నెమలి నరసయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాధితురాలు మూడు నెలలుగా దీక్ష చేస్తుంటే పట్టించుకోకపోవడం చాలా బాధకరమని అన్నారు. శాంతియుత మార్గంలో సాయి సూర్య వర్మ ఇంటి ముందు మౌనిక ఆమె తల్లి ఇద్దరు దీక్ష చేస్తుంటే నాలుగైదు సార్లు దాడులు చేశారన్నారు. బాధితురాలికి మద్దతుగా ఉన్న ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్ ముంజల బిక్షపతి మీద కూడా దాడి చేశారన్నారు. గూడెపు మౌనిక పోలిస్ స్టేషన్లో పోలీసులను కలిసి వస్తుండగా గతంలో పోలీస్‌స్టేషన్ ముందే దాడి చేశార న్నారు.మౌనిక కు న్యాయం జరిగేంత వరకు జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట రవి మాదిగ, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్, ఎమ్మార్పీఎస్ అనుబంధ విద్యార్థి సంఘం జిల్లా ఇంచార్జి బుర్ర సతీష్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మడిపల్లి శ్యామ్ మాదిగ, మాలమహానాడు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదారి భద్రయ్య, ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా నాయకులు కళ్ళు పల్లి రమేష్ మాదిగ, మాల మహానాడు సంఘం జిల్లా కార్యదర్శి ఈద కుమారస్వామి పాల్గొన్నారు.