Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ అధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క జన్మదినం సందర్భంగా మండలంలోనీ రామచంద్రపురం గ్రామంలో గ్రామ శాక అధ్యక్షుడు దుదిమెట్ల మోహన్ రావు ఆధ్వర్యంలో వార్డు మెంబర్ ముతి ఉప్పమ్మ కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్రావు మాట్లాడుతూ... భవిష్యత్తులో సీతక్క మరిన్ని ఉన్నత శిఖరాలను ఎదగాలని, పేద ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జీన్నారపు బాస్కర్ రావు, ఉపాధ్యక్షుడు చింత లక్ష్మీ నారాయణ, చింత నారాయణ, వర్ససురేష్, తోట్టీ అనీల్, రమేష్, దుర్గయ్య కల్తీ శ్రీలత, కాంగ్రేస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల కమిటీ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ కార్యదర్శి భూక్య లక్ష్మీ, మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య, మహిళా అధ్యక్షురాలు తొట్టి హైమవతి, టౌన్ అధ్యక్షుడు నాయని శ్రీనివాస్ రెడ్డి, మలోత్ శారదా, భాను, రామకోటి, సుధాకర్, రామగిరి వెంకటేశ్వర్లు, గాంధి, మధుకర్ రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.