Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షులు వేల్పుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలంటూ నిరుద్యోగులతో కలిసి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ ఆదేశాల మేరకు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బంగారు తెలంగాణా లో కేవలం కెసీర్ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలొచ్చాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భతి ఇస్తామని హామీనిచ్చి విస్మరించారన్నారు. ఇప్పటివరకు చెల్లించాల్సిన 31 నెలలకు రూ.91వేల నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్ చేశారు. గొర్ల పంపిణీకి డీడీలు చెల్లించి సంవ త్సరాలు గడు స్తున్నా పంపిణీ చేయట్లేద న్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు తక్కలపల్లి దేవేందర్, జిల్లా ఉపా ధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, కొత్త సుధాకర్ రెడ్డి, కర్ర సాంబశివారెడ్డి, యువమోర్చా మండల ప్రధానకార్యదర్శి గౌతమ్, రవిశంకర్, భార్గవ్ పాల్గొన్నారు.