Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూపాలపల్లి: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్వర్క్ను విస్తరించడం ద్వారా ఐఐటీ, డాక్టర్ చదవాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేసే సంస్థ ఆకాష్. భూపాలపల్లిలో తొలి సమాచార కేంద్రాన్ని నేడు ప్రారంభించింది. ఈ సమాచార కేంద్రంలో ఆకాష్ అందిస్తున్న కోర్సులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారమూ పొందవచ్చు. ఆకాష్ వద్ద విద్యార్థులు ఇప్పుడు వైద్య, ఇంజినీరింగ్ కోర్సులతో పాటుగా ఫౌండేషన్ స్థాయి కోర్సులను సైతం ఎంచుకోవచ్చు.ఈ నూతన సమాచార కేంద్రాన్ని వర్ట్యువల్గా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనూప్ అగర్వాల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సందీప్ ధామ్, రీజనల్ డైరెక్టర్–ఏఈఎస్ఎల్ ధీరజ్ కుమార్ మిశ్రా సంయుక్తంగా ప్రారంభించగా, భౌతికంగా డిప్యూటీ డైరెక్టర్ కె రాజు, ఏబీహెచ్ ఎం భరత్, ఏడీ మధుసూదన్ పులి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ 'ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలని ఆశిస్తోన్నస్థానిక విద్యార్థులకు భూపాలపల్లిలోని ఈ కేంద్రం ఓ వరంగా మారనుందని' అన్నారు. దేశవ్యాప్తంగా తమ నాణ్యమైన బోధన ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరువయ్యామంటూ ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్లకు ఎంపికైన తమ విద్యార్థులే దానికి నిదర్శనమన్నారు. ఆకాష్లో చేరగోరు విద్యార్థులు ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (ఐఏసీఎస్టీ) లేదంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ పరీక్షలలో పాల్గొనవచ్చు. ఐఏసీఎస్టీని 8–12 తరగతి విద్యార్థులకు 90% వరకూ స్కాలర్షిప్ను ట్యూషన్ ఫీజుపై అందించేందుకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధికారులు, ఫ్యాకల్టీ, అతిథులు పాల్గొన్నారు.