Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బి రాణిబాయి రామారావు
నవతెలంగాణ-మహాదేవపూర్
సుధీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెట్టేందుకు సీఎం కేసీఆర్ చేప్పట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలం లోని పల్లెలన్నీ మెరిసాయని, ఫలితంగా మండలం మెరిసి ిపోతోందంని ఎంపీపీ బి రాణిబాయి రామారావు అన్నారు. మహాదేవపూర్ గ్రామ పంచాయతీ లో ఆదివారం సర్పంచ్ శ్రీపతి బాపు అధ్యక్షతన నిర్వహించిన పల్లె ప్రగతి ముగింపు గ్రామసభలో ఎంపీపీ పాల్గొని మాట్లాడారు. 10 రోజులుగా మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా మండల ప్రత్యేక అధికారి, సీఈఓ శోభారాణికి కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డు పక్కన చెత్త లేకుండా శుభ్రపరిచారన్నారు. పల్లెల్లో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంతో సమస్యలు తొలగిపోయాయన్నారు. నర్సరీల్లోని మొక్కలు ఇండ్లకు చేరి హరిత వనాలుగా మారుతాన్నాయన్నారు. వాడల్లు హైమాస్ లెట్లతో కాంతులీ నుతున్నాయని అన్నారు. జూన్ 30 నుంచి జులై 10 వరకు పల్లె ప్రగతిని విజయవంతంగా నిర్వహించా మన్నారు. గ్రామాల్లో పల్లె నిద్ర, పాదయాత్ర లు చేసి సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. పల్లె ప్రగతిలో ఉత్తమంగా పనిచేసిన రెండు పంచాయతీ లను ఎంపిక చేసి ఉత్తమ పంచాయతీలుగా ప్రకటించి ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని ఎంపీపి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అరుణ శ్రీనివాస్, ఎంపీఓ ప్రసాద్, ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్, కార్యదర్శి రవీందర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.