Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ధరావత్ రాజునాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాబా దేవాలయ ఆవరణలో మొక్కలు నాటరు. నర్మెట చౌరస్తాలో పండ్లు పంపిణీ చేశారు. జిల్లా కార్యదర్శి సోక్కం అనిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి నాగభూషణం శర్మ, మండల కార్యదర్శి ధరావత్ వినోద్, మాజీ మండల అధ్యక్షులు బండి శ్రీను, బీజేవైఎం మండల అధ్యక్షులు పోలు రాజు, బీజేపీ మండల సోషల్ మీడియా కన్వీనర్ తోకల శేఖర్, బీజేవైఎం మండల కార్యదర్శి మేడ బోయిన రాజు ,కోశాధికారి శివ పాల్గొన్నారు
మహాదేవపూర్ : బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజరు కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో మహాదేవపూర్ చౌరస్తా లో ఆదివారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాంశెట్టి మనోజ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జోగేష్ శ్యామ్, రాజేందర్, శివ,జగన్ సురేష్ కిషన్ శేఖర్ పాల్గొన్నారు.
అలాగే అనసూయమ్మ ట్రస్ట్ ఛైర్మెన్, బీజేపీ మంథని నాయకులు సునీల్‌రెడ్డి ఆదేశాల మేరకు మహాదేవపూర్ మండల డైరెక్టర్ సంపత్ రెడ్డి, పలిమెల మండల డైరెక్టర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మహాదేవపూర్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు. నాయకులు జగన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్యకర్తలు సాయి ,సందీప్ , రాకేష్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
మహాముత్తారం : బీజేపీ రాష్ట్ర రథ సారధి బండి సంజరు జన్మదినం సందర్భంగా మండలంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. మహాముత్తారం మండల అధ్యక్షుడు పిల్లలమర్రి సంపత్, ప్రధాన కార్యదర్శి శివ పాల్గని మాట్లాడారు. సీనియర్ నాయకులు రత్నాకర్ దేవేందర్, మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌నాయక్ శ్రీకాంత్, పటేల్, హర్ష, సాయి, రఘు పాల్గొన్నారు.