Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలోనూ ప్రజలకు అండగా కమ్యూనిస్టులు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-గార్ల
ఐక్యపోరాటాలతోనే సమస్యలు పరిష్కార మౌతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం స్పష్టం చేశారు. పోరాటాల దిశగా ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. కరోనా కాలంలోనూ కమ్యూనిస్టులే ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. మండ లంలోని గోపాలపురంలో ఇమ్మడి గోవింద్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన పార్టీ 11వ శాఖ మహాసభకు తమ్మినేని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టు పాలన సాగుతున్న చైనాలో కరోనా నియంత్రణ చర్యలు పటిష్ఠంగా అమలు చేశారన్నారు. కరోనాతో దేశం అల్లకలో ్లలమైన స్థితిలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించారని తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కరోనా మూడో దశ తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్న తరుణంలో దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వకుండా మొదటి డోస్‌తోనే సరి పెడుతూ ప్రధాన మోడీ నిర్లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోనే లేక ప్రభుత్వాలు చేతులెత్తేసిన తరుణంలో అన్ని సౌకర్యాలతో చికిత్స అందిస్తూ పార్టీ కార్యాలయా లను ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి బాధితులకు కమ్యూనిస్టులు అండగా నిలిచినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభి స్తున్న తప్పుడు విధానాల వలే పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. పాలకుల తప్పుడు విధానాలను ఎండగడుతూ కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. తొలుత తమ్మినేని వీరభద్రంకు మహిళలు పూలమాలలతో ఘనం గా స్వాగతం పలికారు. ఎర్ర చొక్కాలు, చీర్రలు ధరించి భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్, కందు నూరి కవిత, మండల కార్యదర్శి గిరిప్రసాద్, ఖమ్మం జిల్లా హవేలీ కార్యదర్శి తిరుపతిరావు, మండల నాయకులు వెంకటేశ్వర్లు, ఉపేందర్ రెడ్డి, ఎల్లయ్య, ఈశ్వర్‌లింగం, నర్సింహారావు, రాజారావు, నాగమణి, వీరస్వామి, రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు వెంకటరమణ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.