Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
- బాధిత కుటుంబాలకు పరామర్శ
నవతెలంగాణ-తొర్రూరు
విద్యుద్ఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందడం బాధా కరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండ లంలోని భోజ్యాతండాకు చెందిన మాలోత్ యాకూబ్, సుధాకర్ విద్యుద్ఘాతానికి గురై శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి దయాకర్రావు భోజ్యాతండాకు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
'మత్స్య' సభ్యురాలికి రూ.2 లక్షల చెక్కు అందజేత
తొర్రూర్ టౌన్ : మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన మత్స్య సహకార సంఘ సభ్యుడు సింగారం యాకయ్య ఇటీవల మృతి చెందగా అతడి భార్య యాదమ్మకు మంత్రి దయాకర్రావు రూ.2 లక్షల చెక్కు అందించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి బుజ్జి బాబు, పర్యవేక్షకుడు యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.