Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
జనాభా పెరుగుదలను కట్టడి చేయాలని పర్యావరణ వేత్త డా|| రతన్‌సింగ్ తెలిపారు. ఆదివారం ఏవీవీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొడిమాల శ్రీనివాస్‌రావు ఆద్వర్యంలో 'జనాభా పెరుగుదల, దాని ప్రభావం'' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జనాభా పెరుగుదలతో వనరులు అందరికీ సరిపోక సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అధిక జనాభాతో పేదరికం రేటు పెరుగుతుందన్నారు. జనాభా పెరుగుదల వలనే అనేక నష్టాలు కలుగుతాయని, అందువలన జనాబా కట్టడి కోసం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బండ కాళీప్రసాద్, డా||జగదీశ్వర్, తోట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.