Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట మునిగిన పలు కాలనీలు
- వణుకుతున్న నగర ప్రజలు .
- ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
శనివారం నుంచి ఆదివారం వరకు కురిసిన వర్షానికి వరంగల్ మహానగరంలో పలుకాలనీలు నీట మునిగాయి. నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షాకాలం ప్రారంభము కాకా ముందే పాలకలు అధికారులు వరంగల్‌కు వరద ముప్పు రాకుండా ఉండటానికి ఎన్నో సమావేశాలు, సమీక్షలు ఏర్పాటు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. మురికి కాల్వల్లో కూరుకపోయిన సిల్టును తీసివేయటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లుగా ఉండటం వల్ల పైపైన సిల్టు తీయడం వలన మురికి నీరు ముందుకుపోక రోడ్లపైకి వర్షం నీరు వచ్చి చేరాయి. కచ్చ కాలువలు తీసినప్పటికీ ముంపు ప్రాంతాలు జలమయం కావడం తప్పలేదు.
ఆదివారం కురిసిన వర్షానికి సుమారు రెండు ఫీట్ల్ల ఎత్తు వరకు రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. మురికి కాలువలో ఉన్న నీరు రోడ్లపైకి వచ్చి రోడ్లు, పలు కాలనీలతో పాటు మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోకి వర్షపు నీరు నిలిచి చెరువులను తలపించాయి. రంగశాయిపేట, శాకరాసికుంట, ఓఎస్నగర్, ఆటోనగర్, సాయి గణేష్ కాలనీ, ఎస్సార్ నగర్, ఎన్ఎన్ నగర్, ఎమ్హెచ్ నగర్, చాకలి ఐలమ్మ నగర్, ఎన్టీఆర్ నగర్, ఎం ఎన్ ఆర్ నగర్, డీజిల్ కాలనీ, జుబ్లీ మార్కెట్, కడిపికొండ, భట్టుపల్లి, సిద్ధార్థ నగర్, వెంకటాద్రినగర్, కాజీపేట దర్గా, సమ్మయ్య నగర్ తదితర పలు కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడం వల్ల నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ బ్రిడ్జి, పోచమ్మమైదాన్ సర్కిల్, కాశిబుగ్గ సర్కిల్, ములుగు రోడ్డు చింతగట్టు క్యాంపు భీమారంలలో సుమారు రెండు ఫీట్ల లోతు వరకు వర్షపు నీరు చేరడం వల్ల వాహనాలకు అంతరాయం కలిగింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వరంగల్ నగరంలో కుంభవష్టి వర్షాలు కురిశాయి. దీంతో సుమారు నలభ్కె ఏడు కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. ఆపద సమయంలో ప్రజలను రక్షించేందుకు విపత్తు నివారణ బందాలను హైదరాబాదు నుండి తెప్పించాయి. ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ ,జీడబ్ల్యూఎంసీ డీఆర్ ఎఫ్ బందాలు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వరదల్లో చిక్కుకున్న వద్ధులు మహిళలు గర్భిణులు చిన్న పిల్లలు తదితర 1099 మందిని రక్షించి, పన్నెండు సహాయ పునరావాస ప్రాంతాలకు తరలించారు. అప్పటి కమిషనర్ పమేలా సత్పతి, గుండా ప్రకాష్ రావు సూచనల మేరకు వరంగల్‌కు వరద ముప్పు రాకుండా ఉండడానికి నాలాలపై అక్రమంగా నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు డీఆర్ఎఫ్ సమన్వయంతో తొలగించారు. కానీ రిటైనింగ్ వాల్ నిర్మించడంలో నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా నిలిచాయి . నాలల నుండి వచ్చే మురుగునీరు ఇండ్లలోకి చేరిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు , అధికారులు పట్టించుకోని నగరానికి వరద ముప్పు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టం
నగరంలో శనివారం నుంచి కురిసిన వర్షానికి ఎస్ ఆర్ ఆర్ తోట, వడ్డెపల్లి, ఎస్బీహెచ్ కాలనీ, ఎక్సైజ్ కాలనీలలో చెట్లు నేలమట్టమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భారీ వర్షానికి కూలిపోయిన చెట్లను డీఎఫ్‌వో కిశోర్ అధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బందం నేలమట్టమైన చెట్లను తొలిగించారు .