Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురిజాల పెద్దం చెరువు వాగులోఒకరు గల్లంతు..
- పాకాలకు 15, మాధన్నపేటకు 12 అడుగులకు చేరిన నీటి మట్టం..
నవతెలంగాణ-నర్సంపేట
డివిజన్లో భారీ వర్షంతో వాగులు పొంగిపొర్లాయి.. చెరువుల మత్తళ్లు పరవళ్లు తొక్కాయి.. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు కుంటపోతగా కురిసిన వర్షంతో చెరువుల్లోకి నీటి ప్రవాహం పెరు గుతుంది.. పాకాల చెరువులోకి 15 అడుగుల నీటి మట్టానికి చేరుకోగా, మాధన్నపేట పెద్ద చెరువులోకి 12 అడుగుల నీరు చేరుకొంది..రంగయ్య చెరువులోకి వరద చేరుకుంటుంది.. మండంలోని గురిజాల గ్రామంలోని పెద్దం చెరువు మత్తళ్లు పరవళ్లు తొక్కుతుంది.. వాగు ఉధృతంగా ప్రవహించడంతో చెక్‌డ్యామ్ దాటుతుండగా గడ్డం అనిల్ అనే వ్యక్తి వాగులో గల్లంతు అయ్యాడు. ఇతని కుటుంబం వ్యవసాయంతో పాటు కూరగాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. భార్య పద్మ కూరగాయలు అమ్ముతుంది ఇందుకోసం ప్రతి రోజు నర్సంపేట మార్కెట్ నుంచి కూరగాయల కోసం వెళ్లినట్లే ఆదివారం తెల్లవారు జామున వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. వాగు ఉధృతంగా ప్రవహించడం చూసిన అనిల్ తన వాహనాన్ని చేతపట్టుకొని చెక్‌డ్యామ్ మీదిగా నడుచుకుంటూ దాటే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహ ఉధృతికి అతని కాలుజారీంది వాహనాన్ని విడిచి గట్టుకు చేరే ప్రయత్నం చేసిన ఫలించలేదు. వాగులో అనిల్ కొట్టుకపోయినట్లు గ్రామస్తులు చెప్పారు. ఈ సంఘటనపై రెవిన్యూ, పోలీసుల అధికారులు అక్కడకు చేరుకొని అనిల్ ఆచూకి కోసం వెతికే చర్యలు చేపట్టారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గాలింపు చర్యలు చేపట్టడానికి అనుకూలత లేకుండా పోయింది.
డివిజన్లో నమోదైన వర్షపాతం..
డివిజన్లో కురిసిన భారీ వర్షంతో వానకాలం మొదటి సారిగా వర్షపాతం గణనీయంగా పెరి గింది. నర్సంపేట మండలంలో 53.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఖానాపురంలో 31.6 మి.మీ, చెన్నారావుపేటలో 23.4 మి.మీ, నల్లబెల్లిలో 16.8 మి.మీ, దుగ్గొండిలో 21.0 మి.మీ, నెక్కొండలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.