Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
జనాభా నియంత్రణ కోసం ప్రజలు కుటుంబ నియంత్రణ పాటించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ అధ్యక్షుడు డా|| రాజగోపాల్ తెలిపారు. ఆదివారం రంగశాయి పేటలోని మాధవ హస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ ఆధ్వర్యంలో 'ప్రపంచ జనాభా దినోత్సవం' సందర్భంగా అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ.. అధిక జనాభాతో అనర్థాలు తప్పవన్నారు. అందుకని జనాభా నియంత్రణ కోసం ప్రజలు కుటుంబ నియంత్రన పద్ధతులు పాటించాలన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు ముద్దు అనే నినాదంతో ప్రజలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఐదుగురికి క్లబ్ సహకారంతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ మండల పరశురాములు, ఎం రాజు, రమా, సహేదా బేగ్, అజ్మీరా, యాకుబీ తదితరులు పాల్గొన్నారు.