Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనుగాల
నవతెలంగాణ-నడికూడ
పేరుకే నడికూడ మండల కేంద్రమని, ఇక్కడ జరిగినా అభివృద్ధి మాత్రం శూన్యమని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. ఆదివారం మండంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కాంట్రాక్ట్‌ల మీద ఉన్న ఇంట్రెస్ట్ నియోజకవర్గం అభివద్ధి పనుల మీద లేదని విమర్శించారు. కొత్త మండలంలో ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. మంజూరైన తహశీల్దార్ కార్యాలయ పనులు నత్తనడకన జరగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన నియోజకవర్గాన్ని అభివద్ధి చేయడం లేదు గానీ, పక్కనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివద్ధి చేస్తానని చెప్పటమేంటని ఆయన ప్రశ్నించారు. మండల కేంద్రంలో పీహెచ్సీ, బ్యాంకు, బస్సు సౌకర్యం లేదని, డబుల్ బెడ్రూం ఇండ్ల జాడే లేదన్నారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ అభివద్ధికి కషి చేయాలని, లేనియెడల ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరాటి తిరుపతి రెడ్డి, బుర్ర దేవేందర్, కుడ్ల మల్హర్ రావు, తాళ్ల నవీన్, తాళ్ల శంకర్, వనపర్తి నవీన్ పాల్గొన్నారు.