Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ శ్రీరామ్ ఆడపిల్లలు చైతన్యంతో ఎదిగేలా చూడాలి
- మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి
నవతెలంగాణ-భూపాలపల్లి
సమస్యలు అధిగమించి మహిళలు అభివృద్ధి సాధించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. భూపాలపల్లిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాన్ఫెరెన్స్ హాల్, ప్రగతి భవన్లో ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... స్త్రీ పురుష సమానత్వం, వివాహ వయస్సు, కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత వివరించారు. మాతా శిశు సంక్షేమం, పేదరికం, నిరుద్యోగ సమస్యలు మానవ హక్కులు, వనరులు - సంపదల వినియోగం అందరికి ఆరోగ్యం అనే సామాజికతను పరిరక్షించడం అందరి బాధ్యత కావాలన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైద్యురాలు ప్రవళిక, స్టాఫ్ నర్స్ కృపావరం, హెల్త్ సూపర్వైజర్ ఉపేంద్రమ్మ, ఏఎన్ఎం శ్రీలత, ఆశ లక్ష్మి, ఒక బాబు తో వాసెక్టమి చేయించుకున్న గాజే కుమారస్వామికి అవార్డులు అందజేశారు. అలాగే వైద్య సేవలందించిన వైద్యులు, సీహెచ్‌ఓలు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు 35మందికి ప్రత్యేక అవార్డులు అందజేశారు.
ఆడపిల్లలు చైతన్యంతో ఎదిగేలా చూడాలి
అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్దు మాట్లాడుతూ.. ఆడ,మగ వ్యత్యాసాన్ని దూరం చేయాలని, ఆడపిల్లలు చైతన్యంతో ఎదిగేలా చూడాలని అన్నారు. జనాభా దినోత్సవం ఉత్సవంలా కాకుండా అవగాహన కలగించేలా ఉండాలన్నారు. వైద్యుల కృషితో కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగిందని అన్నారు. జనాభా ఎక్కువైతే సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. యువతకు సరైన దారి చూపించి మార్గదర్శనంగా ఉందామన్నారు. యువకులకు వివాహ వయస్సుపై అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన వారికి అనాధ పిల్లలను దత్తత తీసుకునే వాళ్ళను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆరోగ్యశాఖ సిబ్బంది గతేడాదిగా సేవలందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీదేవి, కార్పొరేటర్లు ముంజంపల్లి మురళీధర్, పానుగంటి హారిక, ప్రోగ్రాం ఆఫీసర్లు ఉమాదేవి, మమతాదేవి, రవికుమార్, గోపినాధ్, రామారావు, ఇన్చార్జి మాస్ మీడియా అధికారి అన్వర్, వైద్యులు జ్యోతి, ప్రమోద్‌కుమార్, సీహెచ్ఓ రాజన్న పాల్గొన్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మున్సిపల్ చైర్పర్సన్
భూపాలపల్లి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సూచించారు. ఆదివారం మున్సిపల్ పరిధి 18వ వార్డులో పట్టణ ప్రగతి పనులను ఆమె పర్యవేక్షించారు. అనంతరం 26వ వార్డు కౌన్సిలర్ పానుగంటి హారికాశ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఆమెవెంట నాగుల శిరీష దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్ పానుగంటి హారిక శ్రీనివాస్, మున్సిపల్ స్టాఫ్ రాజ్యలక్ష్మి, మెప్మా సిబ్బంది రాజేశ్వ, తదితరులు ఉన్నారు.