Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలో పల్లెప్రగతిలో భాగంగా దళితవాడలో పల్లె నిద్ర ముగింపు దశకు చేరుకున్న సంధర్బంగా ఆయన దళిత వాడల్లో ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రని అన్నారు. ప్రజలు శుభ్రత పాటిస్తూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ దేశంలోనే గొప్ప చరితను పొందిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. దళితుల సాధికారతే లక్ష్యంగా దళితుల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు రూ.1200 కోట్లు వెచ్చించి దళితుల పక్షపాతిగా నిలిచారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందు బాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందంజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు సురేష్ కుమార్, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, సింగపురం దయాకర్, ఎంపీడీఓ కుమారస్వామి, ఈఓ శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు మారేపల్లి ప్రసాద్, సోషల్ మీడియా ఇంచార్జీ రంగు హరీష్,గుండె మల్లేశం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.