Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
పల్లెలు పచ్చని చెట్లతో ఆకుపచ్చ గ్రామలుగా మారాలని ఒకపక్క కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుతల వారీగా హరితహారం కార్యక్రమం చేపడుతూ మొక్కలు నాటుతోంది. వాటికి సంరక్షణ చర్యలు చేపడుతుంటే మరోపక్క ప్రభుత్వ నిబందనలకు విరుద్ధంగా మండలంలోని చిన్నతూండ్ల నుంచి పెద్దతూండ్ల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి సబ్ స్టేషన్ సమీపంలో హరితహారం చెట్లను నరికివేస్తున్నారు. అయినా పట్టించుకునే నాథులు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. అటవీశాఖ, ఉపాధిహామీ అధికారులు సంయుక్తంగా లక్షలు ఖర్చుచేసి నర్సరీల్లో మొక్కలు పెంచారు. వీటిని రహదారులకు ఇరువైపులా, అడవుల్లో, పొలాల గట్లపై వేలాది మొక్కలు నాటితే అందులో వందల మొక్కల కూడా బతకని పరిస్థితి. కాగా వక్షాలుగా ఎదిగిన వాటిని అక్రమంగా పలువురు నరివేస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్న దుస్థితి నెలకొంది. లక్షల ప్రజాధనం కొల్లగొడుతున్న వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.