Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్
నవతెలంగాణ-పాలకుర్తి
అమరవీరుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి రాజేష్ పిలుపునిచ్చారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో అమరవీరుల స్తూపం నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తొలుత గ్రామపంచాయతీ నుండి అంగడి బజార్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన అరుణ పతకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పాల కుర్తి ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని, ప్రజా ఉద్యమాలకు పుట్టినిల్లు అని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన పోరా టయోధులు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి, అనేక మంది వీరులు ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి అందించారని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తిని నేటితరం అందిపుచ్చుకోవా లన్నారు. దేశ సంపదను సామ్రాజ్యవాద పెట్టుబడి దారులకు పాలకులు దోచిపెడుతున్నారని విమర్శిం చారు. ప్రజలపై అనేక భారాలు మోపుతూ పౌర హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. అనేక చట్టాలను మారుస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కెసిఆర్ నిరం కుశ పాలనను కొనసాగిస్తున్నారని, నీళ్లు నిధులు నియామకాలు లేకుండా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడం లేదని అన్నారు. మోడీ కేసీఆర్ ప్రజా విద్రోహ పాలనపై అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జన సంస్కతిక మండలి కళాకారులు అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ పాటలు పాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సూదమల్ల భాస్కర్, మారపల్లి మల్లేష్, బహుజన కులాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడిరాజుల సాంబయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మాన్యపు భుజేందర్, ఐప్వా మహిళ సంఘం జిల్లా కార్యదర్శి అనంతోజు రజిత, జీడి సోమయ్య, ఎండి ఖాసిం, మిట్ట అంజన్న, మల్లన్న, ఉప్పలయ్య, శ్రీకాంత్, రమేష్, సరస్వతి, రేణుక, కీర్తన, కీర్తి, సంజన, స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.