Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మతుల స్మారకార్థం వైకుంఠధామం ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటి ఆత్మీయతను చాటుకున్నారు. మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన నాసిరెడ్డి చిట్టెమ్మ, వినరుకుమార్‌రెడ్డి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి, భార్గవ ఆటోమొబైల్స్ యజమాని నాసిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి గ్రామంలో వారి పేర వైకుంఠధామం నిర్మించారు. హరితహారంలో భాగంగా సోమవారం కుటుంబ సభ్యులంతా కలిసి సుమారు 200ల రకాల మొక్కలు నాటి ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. గోదావరి నది ఒడ్డున గ్రామస్తుల సౌకర్యార్థం వైకుంఠధామం నిర్మించి వికాస్ అగ్రి ఫౌండేషన్, అకినేపల్లి మల్లారం, టీ.కొత్తగూడెం గ్రామ పంచాయతీల సంయుక్త ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో పల్లె ప్రగతి ఆధ్వర్యంలో నాటిన మొక్కలను ఆరోగ్యవంతంగా ఏపుగా పెంచడానికి అవసరమైన ఎరువులను ఆయా గ్రామపంచాయతీలకు వికాస్ అగ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయనున్నట్లు సాంబశివరెడ్డి ప్రకటించారు. అనంతరం విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడారు. నాసిరెడ్డి చిట్టెమ్మ- వినరుకుమార్‌రెడ్డి పేరిట నిర్మించిన వైకుంఠధామంలోని ప్రతిమొక్కనూ సంరక్షించేందుకు నీటి సదుపాయం, ట్రీగార్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాశిరెడ్డి వెంకటరమణ భార్గవ్‌రెడ్డి, గంగుల నరేందర్‌రెడ్డి, నాశిరెడ్డి నారాయణరెడ్డి, నాగిరెడ్డి, కటుకూరి శేషయ్య, వికాస్ అగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి, చెట్టుపల్లి తిరుపతిరావు, వికాస్ రెడ్డి, వివేకానంద రెడ్డి, సమ్మిరెడ్డి, మాధవరెడ్డి, కృష్ణారెడ్డి, పానెం నారాయణ, గంపల కృష్ణ పాల్గొన్నారు.