Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
పెద్దవంగర మండలంలోని సుమారు 7 వేల 500 మందికి ఆనందయ్య మందును టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి దయాకర్రావు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో 1500 ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి ఆలయ కమిటీ చైర్మెన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, పార్టీమాజీ మండల అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజరు, నాయకులు బానోత్ వెంకన్న, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఏదునూరి శ్రీనివాస్, టిఆర్ఎస్ యూత్ నాయకుడు గిరగాని రవి, పెద్దవంగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, మోత్యతండా ఉపసర్పంచ్ గుగులోతు రవి, మండల యాదవ సంఘం అధ్యక్షులు నిమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు.