Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ఇంటింటా చదువుల పంట కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొనేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మొహమ్మద్ అబ్దుల్ హై కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిందని, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం దూరదర్శన్ టీ - శాట్ ద్వారా పాఠాలు వినేలా ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు గత ఏడాది నుంచి అంతర్జాలం,టీవీల ద్వారా పాటలు వింటున్నారన్నారు. కఠినమైన పాఠాలు ఎలా నేర్చుకుం టున్నారో తెలుసుకునేందుకు ఇంటింటా చదువుల పంట కార్యక్రమం విద్యాశాఖ చేపట్టిందన్నారు. దీన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకునేలా చూడాలని సమస్త జిల్లాలోని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులు ఇంటి నుంచే స్వీయ పరీక్ష నిర్వహించుకోవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 20428 (మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు) వాట్సాప్ ద్వారా నమస్తే అని 85955 24405కి సందేశం పంపాలన్నారు. విద్యార్థి పేరు తరగతి, మాధ్యమం నమోదు చేస్తే తరగతి కి సంబంధించి ప్రతి వారం రెండు పాఠ్యాంశాలకు సంబంధించిన పది ఆబ్జెక్టివ్ ప్రశ్నలను వాట్సాప్ ద్వారా పంపుతారన్నారు. సమాధానాలు తప్పుగా రాస్తే వెంటనే సందేశం వస్తుందన్నారు. తక్కువ ప్రతిభ ఉన్న విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పాఠ్యాంశాలను పంపిస్తారని అన్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.