Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలంటే కేంద్రలో మోడీని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఎడ్లబండితో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినా ప్రభుత్వాలు పన్నుల రూపంలో పెట్రోల్, డీజిల్ పై రేట్లు పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారనిమండిపడ్డారు. 13 నెలలుగా పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచుతూ మూలిగే నక్కపైన తాటిపండు పడ్డ చందంగా బిజెపి ప్రభుత్వం వ్యాపార దక్పదంతో వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని అన్నారు. లాక్డౌన్ ఫలితంగా ప్రపంచమంతా ఆర్థికంగా కుంగిపోయిందని, పేద, మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, రైతు, చిల్లర వర్తకులు తీవ్రంగా నష్టపోయా రని అన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వం 18 సార్లు పెట్రోలు, డీజిల్, ధరలు పెంచడం అమానుషమ న్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోలు ధర రూ.104 దాటిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పం దించి పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించా లన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను కాపాడాల్సింది పోయి వారిపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు వరాలు కురిపించేందుకు ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. మోడీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పెట్రోల్, డీజిల్ పై విధించే సేల్స్ టాక్స్ ను రద్దు చేయాల న్నారు. కేంద్రంలో మోడీ తో మాట్లాడి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో అనేక పోరాటా లు నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు చల్లూరు మధు, జడ్పీ ఫ్లోర్ లీడర్ లింగ మల్ల శారద, కాటారం ఎంపీపీ సమ్మయ్య, బుచ్చయ్య, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు కర్ణాకర్ పాల్గొన్నారు.
తెలంగాణలో గడీల దొరల పాలన
: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
జంగా రాఘవరెడ్డి
జనగామ : తెలంగాణ రాష్ట్రంలో గడీల దొరల పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సోమవారం జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామం నుంచి ఆర్టీసీ చౌరస్తా మీదుగా నెహ్రు పార్కు, రైల్వేస్టేషన్ వరకు ఎడ్ల బండ్లు, సైకిల్‌తో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా జంగా రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ అధికారం లోకొచ్చిన తర్వాత కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నార విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సగానికి సగం పడిపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం సెంచరీ దాటిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేటుపరం చేసేందుకు చూపిస్తున్న శ్రద్ధ సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బతుకులు ఆగమై పోతున్నాయని గమనించడం లేదన్నారు. ఒక్క డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుండడంతో ధరలు ఆకాశాన్నంటు తున్నాయన్నారు. కోటిన్నర ఉద్యోగా లు ఇస్తామన్న ప్రధాని మోడీ, నిరుద్యోగులు లేని తెలంగాణా చేస్తానన్న సీఎం కేసీఆర్ ఇద్దరు ఒక్కటై యువత బతుకులు బుగ్గిపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. పాలకులకు బుద్ధి చెప్పేందుకు టీపీసీసీ నూతన అధ్యక్షులు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దొరల పాలనను అంతమొందించేం దుకు ప్రజలతో కలిసి పోరాటాలు ఉధతం చేస్తామ న్నారు. మంత్రి పదవిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమంలో మహిళా ఎంపీడీఓ పై అసభ్యకరంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజాసంఘాలు, మహిళలు అందరూ కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు నిమంత్రి పదవి నుంచి తొలగించేలా ఆందోళన చేపట్టాలని కోరారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా రావడంతో తెలంగాణలో కాంగ్రెస్‌లో, కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ మరింత పెరిగిందన్నారు. 16న రాజ్ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకట్, స్టేషన్‌ఘన్‌పుర్ ఇన్చార్జి సింగాపురం ఇందిర పాల్గొని మాట్లాడారు. జనగామ జిల్లా నాయకులు వేముల సత్యనారాయణరెడ్డి, మర్రి సుధాకర్, లక్ష్మీనారాయణనాయక్ పాల్గొన్నారు.