Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని మేడారం గ్రామానికి ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మెన్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఆలం రాంమూర్తి శవానికి అతడి కుటుంబీకులు, బంధువులు, ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్ర ఉదయం ప్రారంభించారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. రామ్మూర్తిని చూసేందుకు పలు ప్రాంతాల నుంచి అతడి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వివిధ తరగతుల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రామ్మూర్తి మృతదేహానికి ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్, ప్రభుత్వ చీఫ్ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆత్మ చైర్మెన్ దుర్గం రమణయ్య, రైతు సమన్వయ కమిటీ జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, మాజీ మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కాక లింగయ్య, నాలి కన్నయ్య, రేగ నర్సయ్య సహా పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. రామ్మూర్తి శవయాత్రలో పాడెను జెడ్పీ చైర్మెన్ జగదీష్ మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడారు. టీఆర్ఎస్ సీనియర్ నేతగా, మేడారం జాతర ట్రస్ట్ బోర్డ్‌కు చైర్మెన్‌గా రామ్మూర్తి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. రామ్మూర్తి ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. రామ్మూర్తి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శమన్నారు. రెండు సార్లు మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్, ఒకసారి ఉత్సవ కమిటీ చైర్మెన్‌గా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టినా సాధారణ జీవితం గడిపారని కొనియాడారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారు చంద్రయ్య, సర్పంచ్ చిడ్డం బాబురావు, జీసీసీ డైరెక్టర్ పురుషోత్తమ్, మాజీ మండల అధ్యక్షుడు దిడ్డి మోహన్‌రావు, నార్లాపూర్ ఎంపీటీసీ కుక్కల శ్రీను, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన స్వామి, కొక్కెర కష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, యాశాడపు మల్లయ్య, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి నర్సింహ, టీడబ్ల్యూటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎట్టి సారయ్య, గౌరవ అధ్యక్షుడు పొదెం కష్ణ ప్రసాద్, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రసాద్, తదితరులు నివాళ్లర్పించారు.