Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
తెలంగాణ రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన 22 మంది బాధిత రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు మృతిచెందితే బాధిత కుటుంబం రోడ్డున పడే పరిస్థితి గతంలో ఉండేదన్నారు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలస్తున్నాడని తెలిపారు. నియోజవర్గంలో 442 మంది రైతు కుటుంబాలకు బీమా పథకం ద్వారా రూ.22.10 కోట్లను అందించామన్నారు. 66,531 మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా రూ.57.18 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించిందని తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు నీరందిస్తుందన్నారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైఎస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ టీ.శ్రీనివాసరావు, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నెక్కొండ నల్లబెల్లి ఎంపీపీ, జెడ్పీటీసీలు మోతె కలమ్మ ప్రద్మనాభరెడ్డి, వేములపెల్లి ప్రకాశ్‌రావు, వీరేందర్, పత్తినాయక్, కాట్ల కోమల భద్రయ్య, ఊడ్గుల సునిత ప్రవీణ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్లు మోతె జయపాల్ రెడ్డి, కుంజారపు వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటిక సోమయ్య, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.