Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్ ఆఫీసు ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-ఖిలా వరంగల్
పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, స్వంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం లోన్ ఇవ్వాలని సీపీఐ(ఎం) రంగశాయిపేట కమిటీ కార్యదర్శి ఎం. సాగర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ ఆఫీసు ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సాగర్ మాట్లాడుతూ నగరంలో వేలాది మంది నిరుపేదలు స్వంత ఇళ్లు లేక, కిరాయిలు కట్టలేక అవస్తలు పడుతున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో పేదవానికి ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వలేదని, వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు లక్క రమేష్, సింగారం దాసు, ప్రత్యూష, జ్యోతి, రమ్య, క్రిష్ణ, ఆంజనేయులు, బాబు, యశోద, శ్రీనివాస్, డీవైఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు జయరాజు, ఆనంద్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.