Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి
- ఎడ్లబండ్లు, సైకిళ్లతో నిరసనా ర్యాలీ
నవతెలంగాణ-మహబూబాబాద్
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ అనుబంధ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్లు, సైకిళ్లతో సోమవారం భారీ నిరసనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్‌చందర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మురళీనాయక్, డోర్నకల్ ఇన్‌ఛార్జి డాక్టర్ రామచంద్రనాయక్, పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ధనియాకుల రామారావు, అంబటి వీరభద్రగౌడ్, మహేందర్‌రెడ్డి, మిట్టకంటి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్లు, సైకిళ్లతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్, ఫిషరీస్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగటల్టారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, మండల అధ్యక్షులు చాంద్‌పాషా, చెన్నోజు సూర్యనారాయణ, మైల జయరాంరెడ్డి, అఫ్సర్‌పాషా, చిటమట రఘు, జాలపు అనంతరెడ్డి, తదితరుల పాల్గొన్నారు.
కురవి : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామచంద్రనాయక్, డోర్నకల్ కో ఆర్డినేటర్ మాలోత్ నెహ్రూనాయక్ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసనా ర్యాలీలు నిర్వహించారు.
గార్ల : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పురవీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెబోయిన నాగమణి, గుగులోత్ శ్రీను, సురేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదుర్ : మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎండ్లబండ్లు, సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు హెచ్చు వెంకటేశ్వర్లు, తూళ్ల ప్రణరుకుమార్, నరేష్, సురేష్, పూర్ణచందర్, మంచాల వెంకన్న, యాకయ్య, పులి శ్రీను, రంగస్వామి, హెచ్చు రవి, తదితరులు పాల్గొన్నారు.