Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి
నవతెలంగాణ-ములుగు
రాబోయే రోజుల్లో జిల్లాలో పోడు, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలకు శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్‌లో జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాకేష్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికికషి చేయాలని సూచించారు. జిల్లా ఏర్పాటు అనంతరం పార్టీ నానాటికీ బలపడుతోందని చెప్పారు. సంస్కతి, సంప్రదాయాలకు నిలయమైన ములుగు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంటుందని తెలిపారు. సరైన నాయకత్వం లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడచినా ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. మహిళా ఎంపీడీఓ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో జిల్లావ్యాప్తంగా పోడు, నిరుద్యోగ సమస్యపై ఆందోళన కార్యక్రమాలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కష్ణయ్య, జిల్లా సీనియర్ నాయకులు తక్కల్లపల్లి దేవేందర్‌రావు, సూరపనేని వెంకట సురేష్, భూక్య రాజునాయక్, జిల్లా పదాధికారులు నగర రమేష్, గాజుల కష్ణ, అడప భిక్షపతి, మందల విజరుకుమార్, ఏనుగు రవీందర్‌రెడ్డి, కొండూరు నరేష్, శీలమంతుల రవీంద్రాచారి, పొడెం రవీందర్, కర్ర సాంబశివారెడ్డి, శివగాని స్వప్న, మేడిశెట్టి ఓంకార్, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్, మోర్చా అధ్యక్షుడు కొత్త సురేందర్, తదితరులు పాల్గొన్నారు.