Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
- కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు కుటుంబానికి రూ.50 వేలు సాయం
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ అధ్యక్షుడు ఆలం రామ్మూర్తి సేవలు మరువలేనివని టీఆర్ఎస్ పార్టీ సీని యర్, రాష్ట్ర నాయకుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు (లక్ష్మణ్ బాబు), ములుగు జెడ్పీ ఫ్లోర్ లీడర్ తుమ్మల హరి బాబు అన్నారు. రామ్మూర్తి అంత్యక్రియలకు సోమవారం వారు హాజరై బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తొలుత రామ్మూర్తి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం రామ్మూర్తి కుటుంబానికి దహన సంస్కారాల కోసం రూ.50 వేలు సాయం అందించారు. అనంతరం లక్ష్మీనర్సింహారావు మాట్లాడార. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన సమస్యలు పరిష్కరించడంలో రామ్మూర్తి కృషి చాలా ఉందన్నారు. ఆదివాసీ నాయకులు ఎదిగిన ఆదివాసి ఆణిముత్యాన్ని కోల్పోయామని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా, ఒకసారి ఉత్సవ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో గోవిందరావుపేట మండల కోఆప్షన్ సభ్యులు బాబర్, చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య, సీనియర్ నాయకులు బొల్లం శివ, తుమ్మల శివ, కీర్తి రవి, ఫక్రుద్దీన్, కొత్తూరు వెంకటరమణయ్య, మునిగాల వెంకన్న, బొడిగే రఘువీర్, తదితరులు పాల్గొన్నారు.