Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
అక్రమ అరెస్ట్లకు భయపడబోమనికాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లేతకరి రాజబాపు అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసనలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొంటున్నారని తెలిసి కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని హెచ్చరించారు. మండల యూత్ నాయకులు నగేష్ యాదవ్, మాడుగుల పవన్ శర్మ, షకిల్, హైదర్ లక్ష్మణ్, మల్లేష్ పాల్గొన్నారు.
మల్హర్రావు : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండి నిరసన, ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ చింతలపల్లి మల్హర ్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, వొన్న తిరుపతిరావు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,యూత్ నాయకులు పాల్గొన్నారు.
మహాముత్తారం : పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టగా సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులను ఉదయం నుంచే ముందస్తు అరెస్ట్ చేశారు. ధరలను నియంత్రించాలని శాంతియుతంగా ధర్నా చేసేందుకు వెళ్తున నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు పక్కల సడవలిి, సీనియర్ నాయకులు సడవలి, రాజమల్లు పాల్గొన్నారు.