Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ టికెట్ నాదేనంటూ ఫోన్ ఆడియో రికార్డింగ్ లీక్
- కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీస్-రాజీనామా
- హుజురాబాద్‌లో హాట్‌హాట్
నవతెలంగాణ-వరంగల్
టీపీసీసీ కార్యదర్శి, పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాడి కౌశిక్‌రెడ్డి పప్పులో కాలేశారు. తనకు టీఆర్ఎస్ నుంచి టికెట్ ఖరా రైందంటూ యువతను తన వద్దకు తీసుకు రమ్మని బీజేపీ కార్యకర్త విజేందర్కు ఫోన్ చేయ డం, ఆ ఫోన్ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. 24 గంటల్లో వివరణ ఇవ్వా లంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో 'పాడి' కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వారం రోజుల క్రితమే 'పాడి' ఇల్లంతకుంట మండలం లో కాంగ్రెస్ అభ్యర్థిని నేనేనంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. మొదటి నుంచి 'పాడి' వ్యవ హారం కాంగ్రెస్‌లో వివాదాస్పదంగానే ఉంది. ఒక ప్రయివేట్ పార్టీలో మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరపడం, మరో చోట మంత్రి కేటీఆర్ కార్ వద్ద ఆయనతో ముచ్చటించిన నేపథ్యంలో 'పాడి' టీఆర్ఎస్లో చేరుతున్నారని, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న 'పాడి'పై చర్య లు తీసుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్‌లోని ఒక వర్గం బహిరంగంగానే డిమాండ్ చేసిన విషయం విదితమే. 'పాడి' ఆడియో రికార్డింగ్‌తో వెంటనే కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇక తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన పాడి కౌశిక్‌రెడ్డి ఎట్టకేలకు సోమ వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైం దని 'పాడి' వ్యాఖ్యానించడం అటు టీఆర్ఎస్ను ఇబ్బందులకు నెట్టింది. ఇప్పటివరకు 10 మంది నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించిన టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ నేత 'పాడి'కి పార్టీ టికెట్ ను ఎవరు ఖరారు చేశారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఉపఎన్నికకు కొద్ది రోజుల ముందు పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ టికెట్ ఇస్తే పార్టీలో ముందు నుంచి పని చేస్తున్న తమ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
టీపీసీసీ కార్యదర్శి, హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాడి కౌశిక్‌రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నెల రోజులుగా 'పాడి' టీఆర్ఎస్ పార్టీ నేతల టచ్‌లో ఉన్నారు. ఒక ప్రయివేట్ పార్టీలో మంత్రి కేటీఆర్‌తో చర్చలు, మరోచోట మంత్రి కేటీఆర్ వాహనం వద్ద నిలబడి ఆయనతో ముచ్చటిం చిన నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఒక వర్గం 'పాడి' ప్రవర్తనపై మండి పడింది. బహిరంగంగానే 'పాడి' వ్యవహార శైలిని విమర్శించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్ అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం
'పాడి'.. పప్పులో కాలు..
'ఈటల' బర్తరఫ్ అన్యాయమని విమర్శిస్తే, పాడి కౌశిక్‌రెడ్డి 'ఈటల' అక్రమాలు చేశారంటూ విమర్శలు గుప్పించడం, ఈ వార్తలను అధికార టీఆర్ఎస్ మీడియాలో పతాకస్థాయిలో ప్రచారం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో 'పాడి' టీఆర్ఎస్ టచ్‌లో ఉన్నారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ఇటు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహించారు. ఈ క్రమంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థిని నేనేనంటూ బైక్ ర్యాలీని నిర్వహించారు. తాజాగా ఆదివారం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త విజేందర్కు ఫోన్ చేసిన 'పాడి' 'నాకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైంది.. యూత్ అందరినీ పట్టుకురా.. ఖర్చుల కోసం రూ.4-5 వేలు ఇద్దాం..', నిన్ను కూడా చూసుకుంటా..' అంటూ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్త విజేందర్ ధృవీకరించారు. దీంతో పాడి కౌశిక్‌రెడ్డి కష్టాల్లో పడ్డారు. నెల రోజులుగా పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహార శైలి అటు కాంగ్రెస్‌లో, ఇటు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిని నేనేనంటూ బైక్ ర్యాలీ చేసి తాజాగా నాకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇదిలా ఉంటే 'పాడి' ఆడియో లీక్‌తో ఖంగుతిన్న కాంగ్రెస్ వెంటనే నష్టనివారణ చర్యల్లో భాగంగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరింది.
తప్పని రాజీనామా..
పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్‌తో ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెప్పిన 'పాడి' టీఆర్ఎస్లో చేరుతారా ? లేక కొద్దిరోజులు వేచి చూస్తారా ? అన్నది చర్చనీ యాంశంగా మారింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేయడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిందా..?
పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్ కావడంతో టీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొట్టిందన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా అవన్నీ తేలిపోయాయి. గతంలోనూ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జోరుగా సాగింది. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ద్విముఖ వ్యూహంతో 'పాడి'ని వినియోగించుకోవాలని భావించినట్లు రాజకీయ పరిశీలకులు భావించారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కు 'పాడి' సమీప బంధువు కావడం గమనార్హం. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్‌గా కొనసాగితే కాంగ్రెస్ టికెట్ 'పాడి'కి ఖరారు చేశాక, ఆయన్ను చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దింపి కాంగ్రెస్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ ఓటింగ్‌ను తమవైపు తిప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరక్కుండా చేయాలని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆకస్మికంగా టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రంగప్రవేశం చేయడంతో సీన్ మారింది. 'పాడి'కి కాంగ్రెస్ టికెట్ ఖరారుపై అనుమానాలు వ్యక్తం కావడం, రేవంత్ అభిప్రాయాలు భిన్నంగా ఉండడంతో ఇక ఒక స్పష్టనిచ్చే క్రమంలో 'పాడి'కి టీఆర్ఎస్ ముఖ్యుడు గ్రీన్‌సిగల్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 'పాడి' బీజేపీ కార్యకర్త విజేందర్‌తో ఫోన్ సంభాషణ జరపగా అది లీక్ కావడంతో ఇటు 'పాడి' ఇరుకన పడడమే కాకుండా టీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొట్టినట్టయ్యింది.