Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వీ
- కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-మహబూబాబాద్
గ్రామస్థాయిలోనే జ్వరాల తీవ్రతను నియంత్రించాలని వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి అధికారులను ఆదేశిం చారు. సోమవారం డోర్నకల్ మున్సిపల్ పరిధి రైల్వే కమ్యూనిటీ హాల్లో కోవిడ్-19, సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యం లో ఆయన అధికారులతో సమీక్షించి మాట్లా డారు. గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగు పరచాలని, తాతాగునీరు క్లోరినేషన్ చేయాలన్నారు. దోమలు వృద్ధిచెంద కుండా దోమ లార్వా నిరోధించేందుకు క్షేత్ర స్థాయి అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయా లన్నారు. మున్సిపల్ అధికారులు జీపీ సిబ్బంది తో చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీ స్థాయిలో ప్రతి రోజూ 300 ఆర్టిపిసిఆర్ టెస్టులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపడుతూనే ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాల న్నారు.పీహెచ్‌సీలకు కావాల్సిన మందులు పంపిణీ చేస్తామన్నారు. వైద్యాధికారులు స్థానికంగా ఉండాలని, జ్వరాలు వస్తే తాత్కాలిక వైద్యం చేసి ఊరుకోవద్దని అధికారులతో సమన్వయం పెంచుకొని లోతుగా అధ్యయనం చేస్తూ పరిశోధన మొదలు పెట్టాలని జ్వరాలు పెరగకుండా గ్రామస్థాయిలోనే నియంత్రించాలి అన్నారు. మురికివాడల పై ప్రధాన దృష్టి పెట్టాలన్నారు. దోమ లార్వా పెరగకుండా ఉండేందుకు ఆయిల్ బాల్స్ వేయించడం గంభూషియా చేపపిల్లలను వేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు రోగుల వద్ద సేకరించిన నమూనాల ఫలితాలు త్వరితగతిన రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులపై మాట్లాడుతూ ఒకరికి పాజిటివ్ వస్తే వారి కుటుంబ సభ్యులకు స్నేహితులకు మొత్తం 25 మంది దాకా టెస్టులు చేయాలన్నారు. 25 మందిలో ఒకరికి వస్తే వారి కుటుంబ సభ్యులకు వారి పరిసరాల్లో ఉన్న వారికి టెస్ట్ నిర్వహించాలన్నారు. రైల్వే స్టేషన్ బస్టాండ్ ఆటో స్టాండ్ వంటి ప్రధాన సెంటర్లలో వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. హై రిస్క్ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని అన్నారు. నిరుపేదలకు ఇబ్బందులు కలగకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాలని, జ్వరాల తీవ్రత పునరావతం కానీయ రాదన్నారు. ఈ సమావేశంలో డీఎంవి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీహెచ్ డి శ్రీనివాసరావు, టీఎస్ఎస్ఎంఎస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి డాక్టర్ గంగాధర్, ట్రెయినీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, డీఎంహెచ్ఓ హరీష్ రాజు, ఉప వైద్యాధికారి అంబరీష, కోవిడ్ నోడల్ అధికారి రాజేష్ పాల్గొన్నారు.