Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూఎంహెచ్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్
- కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ-ములుగు
నేషనల్ హెల్త్ మిషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేసి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జె సుధాకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓ శ్యాంకుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సుధాకర్, రాజేందర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలో జీఓ నెంబర్ 60 ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచినా ఎన్హెచ్ఎం పరిధిలోని సెకండ్ ఏఎన్ఎంలకు, ఇతర ఉద్యోగులకు వేతనాలు పెంచలేదన్నారు. వారంతా దశాబ్దాలు గా చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేకుండా సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంల సంఘం నాయకులు జమునరాణి, సరోజన, శకుంతల, సునీత, సుజాత, సీత, భాగ్య, తిరుమల, కల్పన, సూర్యకుమారి, వీరలక్ష్మీ, సుగుణవతి, లలిత, వెంకటనర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ :టీయూఎంహెచ్‌ఈయూ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందించారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, తోట శ్రీనివాస్, సువర్ణ, కవిత, భద్రమ్మ, అశ్విని, స్నేహలత, జ్యోతి పాల్గొన్నారు.
మరిపెడ : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సీడీపీఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంపూర్ణ మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాములమ్మ, రమాదేవి, రజని, సునీత, మంగమ్మ, జ్యోతి, ఉమ, కవిత, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సీడీపీఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పెద్దవంగర ప్రాజెక్టు కార్యదర్శి స్వరూప మాట్లాడారు. కార్యక్రమంలో పెద్దవంగర, నెల్లికుదురు మండలాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
గూడూరు : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్‌నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు కత్తి స్వామి, సొసైటీ వైస్ చైర్మెన్ వేం శ్రీనివాస్‌రెడ్డి, తీగలవేణి ఎంపీటీసీ వాసుదేవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి రాధ, వర్కింగ్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ సంపత్, మండల నాయకులు శ్రీపాల్‌రెడ్డి, రసూల్, స్వామి, యాకయ్య, సురేందర్, చంటి, మల్లేష్, మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు.