Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ఇటీవల కురిసిన వర్షాలకు మధ్యకోటలోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయని, వెంటనే ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని ఖిలా వరంగల్ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు ముంపునకు గురయిన భూములను పరిశీలించి మాట్లాడారు. గతేడాది ఈ భూములు ముంపునకు గురవడంతో అధికారులు సందర్శించి సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా ఆ సమయంలో శాశ్వత పరిష్కారర కోసం చేపట్టిన పనులు ఏడాది గడిచినా అలానే ఉన్నాయని మండిపడ్డారు. దీంతో ఇటీవల కురిసన వానలకు మళ్లీ పంట పొలాలు ముంపునకు గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. అంతేకాకుండా ఖిలా వరంగల్లో నీరు నిల్వకుండా అగర్తలా చెరువు మరమ్మతు పనులు, డ్రెయినేజీ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఇనుములు శ్రీనివాస్, ఆకుల మురళి, ఇనుముల సాంబయ్య, తోట రాజేందర్, కనుకుంట్ల కనకయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.