Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీఓకు గ్రామస్తుల వినతి
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని నర్సాపురం బోరు గ్రామపంచా యతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విడుదలయ్యే అభివద్ధి నిధులు దుర్వినియోగంతోపాటు పక్కదారి పడు తున్నయని గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం ఎంపీఓ శ్రీకాంత్ బెహరాకు వినతిపత్రం అందజేసి వారు మాట్లాడారు. గ్రామంలోని సమస్యలను పంచాయతీ కార్యదర్శి దష్టికి తీసుకెల్లేందుకు కార్యాలయానికి వెల్లగా అందుబాటులో లేరని అన్నారు. గ్రామపంచాయతీకి వస్తున్న అభివద్ధి నిధులు ఎక్కడ ఖర్చ చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామసభలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో, గ్రామాభివద్ధి కమిటీలో ఎవరున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామసభ పెట్టి నిధుల వివరాలు తెలపాలన్నారు. కొందరు రాజకీయ నాయకులు వీడీసీల పేరుతో పనులు రాసుకుని తీర్మానాలు లేని చోట తూతూ మంత్రంగా పనులు చేస్తూ నిధులు దర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీకార్యదర్శి సైతం అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాజశేఖర్, సుంకోజు ద్రోణాచారి, సుంకోజు ప్రశాంత్, పుల్లంశెట్టి నాని, జక్కం రవి, రాజు, అశోక్ రెడ్డి, నాగరాజ రెడ్డి, మాదవ్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.