Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఐనవోలు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వెంకటాపురంలో నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు ఏసిన సీపీఐ(ఎం) మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను. దీకొండ ఉప్పలయ్య, రాయపురం కొమురయ్య. ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యఅతిథి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శించారు. పల్లె ప్రగతి సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీకి రెండు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించక పోగా అబద్ధపు ప్రచారాలు చేస్తూన్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
అనంతరం మండల కార్యదర్శి లింగయ్య మాట్లాడుతూ రేషన్ కార్డు లేని ప్రజలు 3 సంవత్సరాల క్రితం 315 మంది దరఖాస్తు చేసుకున్నారని. నేటి వరకూ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మండలంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోగా అక్రమణదారులకు పట్టాలు చేసి ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి పేద ప్రజలకు భూములు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో నూతన గ్రామ కార్యదర్శిగా. దొరికిన వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా కొంకల నారాయణరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మహేందర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బొక్కల రవిబాబు, జక్కుల నర్సయ్య,. కొంకల కవిత, దీకొండ వనమా, బొమ్మకంటి యాకయ్య, దీకొండ నరేష్, మడత నారాయణ, దీకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.