Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
పరిపాలన సౌలభ్యం కోసం పాత జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల ఏర్పాటునకు సహకరించిన మంత్రులు ఎర్రబెల్లి దయకార్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలకు మేయర్ కతజ్ఞతలు తెలి పారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. చరిత్రాత్మక హన్మకొండ, వరంగల్ నగరాలకు విద్య, వైద్య, పర్యాటక, ఆధ్యాత్మిక పరంగా అన్ని రంగాల్లో అభివద్ధి చెందడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల వారికి అందించడం కోసం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయ లక్ష్మి సురేందర్, మరుపల్ల రవి, సిరంగి సునీల్, ఆవాల రాధికారెడ్డి, ఆకులపల్లి మనోహర్, వేముల శ్రీనివాస్, డా.ఇండ్ల నాగేశ్వర్ రావు, అభినవ్ భాస్కర్, ఎలుకంటి రాములు, నెక్కొండ కవిత కిషన్, జక్కుల రజిత పాల్గొన్నారు.
నవతెలంగాణ-కాజీపేట..
వరంగల్, హనుమకొండ జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు కాజీపేట చౌరస్తాలో మంగళవారం మాజీ కార్పొరేటర్ దాస్యం విజరు భాస్కర్, టీఆర్ఎస్ కార్యకర్తలు కతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. ప్రజల సౌకర్యం కోసమే జిల్లాల ఏర్పాటు జరిగిందని మాజీ కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్, టీఆర్ఎస్ కార్యకర్తలు దువ్వ కనకరాజు, నరేష్, మరియాల కష్ణ, సుబ్బు, నయీమ్ జుబేర్, ఆర్టీఏ రాజు పాల్గొన్నారు.
నవతెలంగాణ- కాశిబుగ్గ
పరిపాలన సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని 20, 19వ డివిజన్ కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, ఓని స్వర్ణలత భాస్కర్లు తెలిపారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, ఎమ్మెల్యే నరేందర్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరంగల్, హన్మకొండ జిల్లాలు వేర్వేరుగా ఏర్పాటు చేయడంతో వరంగల్ నగరం మరింత అభివద్ధి చెందుతుందని అన్నారు. పద్మ గంగాధర్, బేతి అశోక్, చిమ్మని గోపి, బొద్దుల కుమార్, 20వ డివిజన్ అధ్యక్షుడు ఎండి ఇక్బాల్, నాగరాజు, సుధాకర్, బాలరాజు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఖిలా వరంగల్
వరంగల్, హన్మకొండ ఏర్పాటునకు నోటిఫికేషన్ విడుదల చేసినందకు 37వ డివిజన్ హన్మాన్ సెంటర్లో మంగళవారం సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేశ్, మాజీ కార్పొరేటర్ బిల్లా కవిత శ్రీకాంత్, నాయకులు అర్సం బాబురావు, ఎండీ ఉల్పత్, చందర్ తదితరులు పాల్గొన్నారు.