Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మంగపేట మండలంలో మంగళవారం 40.05 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదైంది. ఉదయం 10 గంటల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు రోడ్ల పైకి రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాలు, పంట పొలాలు నీటమయం కాగా మంగపేట గౌరారం వాగు, మల్లూరు వాగు, రాజుపేట ముసలమ్మ వాగుల్లో వరద నీటి ప్రవాహం పెరిగింది. మండలంలోని లోతట్టు గ్రామాలైన మంగపేట పొద్మూరు, వడ్డెరి కాలనీ, బీసీ కాలనీలతో పాటు మల్లూరు శివాలయం వీధి, కమలాపురం ఆర్పీహెచ్ కాలనీ, చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట, వాడగూడెం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారంలలో రోడ్లు స్వల్పంగా నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్ప గ్రామపంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేక అధికారులు గ్రామస్తుల నుండి ఎప్పటికప్పడు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. కంతనపల్లి బ్యారేజీ నుండి గోదావరి వరద నీటిని దిగువకు వదలడంతో గోదావరి ఉదతి పెరిగింది. గోదావరిలో చేపలు పట్టే వారు. నావికులు వరద ఉధతి దష్ట్య గోదావరిలోకి వెల్లవద్దని తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ తెలిపారు. గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధతిని గమనిస్తూ అవసరమైతే సహాయక చర్యలకు ఉపక్రమించాలని రెవిన్యూ కార్యదర్శులను తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ ఆదేశించారు.