Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువును తలపిస్తున్న 100 పడకల ఆసుపత్రి
- ఇబ్బంది పడుతున్న రోగులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి దారి కరువైంది. గతేడాదిగా వర్షాకాలంలో నీరు నిలుస్తుందని తెలిసినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి 3 నెలల క్రితం 30 పడకలతో వినియోగంలోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో కరోనా క్వారంటైన్తోపాటు ప్రసూతి ఆసుపత్రి కొనసాగుతోంది.ఇదే సమయంలో ఇరవై రోజుల నుంచి జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం సైతం ఈ ఆస్పత్రిలో కొనసాగుతున్నాయి. గత సంవత్సరం కరోనా విజృంభిస్తున్న తరుణంలో జిల్లా క్వారెంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పుడు కురిసిన వర్షాలకు ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు వరదనీరు భారీగా చేరింది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా ఈ ఏడాది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. పక్కనే చెరువు ఉండటం లోతట్టు ప్రాంతం కావడంతో చుట్టుపక్కల నుండి వరద నీరు వచ్చింది. దీంతో వైద్యులు ఇతర సిబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రసూతి వైద్య సేవలతోపాటు కరోనా పేషెంట్లు, జిల్లా వైద్య శాఖ అధికారి అధికారులు సిబ్బంది కూడా విధులకు హాజరుకాకపోవడంతో సమస్య తీవ్రమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆస్పత్రిపై... నీలి నీడలు...
జిల్లా కేంద్రంలో నిర్వహించిన వంద పడకల ఆసుపత్రి పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కార మవుతాయని వేయి కండ్లదో ఎదురు చూస్తున్నా అధికారుల నిర్లక్ష్యానికి పాలకుల నిర్లిప్తత ఈ 100 పడకల ఆసుపత్రి నిదర్శనంగా కనిపిస్తుంది. 5 సంవత్సరాల క్రితం ఆసుపత్రి శంకుస్థాపన చేసిన రెండు సంవత్సరాల క్రితమే ప్రధాన నిర్మాణాన్ని పూర్తయి గత సంవత్సర కాలంగా చిన్న చిన్న వైద్య సిబ్బంది తో నామమాత్రంగా ప్రారంభించారు. పూర్తిస్థాయి సిబ్బందిని నియమించడంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. 6 నెలల క్రితం ఆస్పత్రి కోసం డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు వివిధ శాఖలకు చెందిన వైద్య సిబ్బందికి చెందిన 80 మంది పోస్టులు భర్తీ చేశామని చెబుతున్నా అధికారులు సరైన వైద్యమందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూపాలపల్లి పట్టణ జనాభా చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే లక్ష పైగా దాటుతుంది. వీరందరికీ మండల కేంద్రంలో ఉన్న పీహెచ్సీ దిక్కుగా మారింది. ఇరవై రోజుల క్రితం నుంచి జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయాన్ని సైతం ఈ వంద పడకల ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. గ్రామంలో వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆశించినప్పటికి అమలు జరగడం లేదు. వంద పడకల ఆసుపత్రి 2015 మే 10వ తేదీన శంకుస్థాపన చేయగా రెండేళ్లలో పూర్తికావలసిన ఆసుపత్రి నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా జాప్యం జరిగింది. సంవత్సరం క్రితం ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తికి ప్రారంభానికి ముహూర్తం కూడా సిద్ధం చేశారు. కారణాలు ఏమైనా ప్రారంభం కాలేదు. మూడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా 30 పడకల తో ఆసుపత్రి ప్రారంభించారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించడంతో పాటు సెంటర్ ఏర్పాటు చేశారు. వసతులు ఇంకా చేయాల్సి ఉంది. జిల్లాలో సీజనల్ వ్యాధులతో పాటు కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కావున ప్రజలకు ఎంతో ఉపయోగపడే వంద పడకల ఆసుపత్రికి పూర్తి సౌకర్యాలు కల్పించి రోగులను మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
శాశ్వత పరిష్కారం ఏది....
జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఆస్పత్రిలో కి వరద నీరు చేరడంతో రోగులు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వెంచర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి వర్షాకాలంలో ఆస్పత్రి వద్ద నీరు నిలవతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్కనే కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్పటికీ వర్షానికి ఈ ఆస్పత్రి ఆనుకొని ఉన్న చెరువు లోకి నీరు చేరి సమస్య తలెత్తుతోంది. ఆసుపత్రి తో పాటు కలెక్టర్ కార్యాలయ నిర్మాణాలు చేపట్టే టప్పుడు కాలువ ఎన్ని ఫీట్లు ఎక్కడ తీయాలి.. ప్రధాన రహదారి నిర్మించాలనే అవగాహన లోపంతో నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా నీటి పారుదల శాఖ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ జిల్లా అధికారులు స్పందించి ఆసుపత్రికి కలెక్టర్ కార్యాలయానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది
వరద నీరును వెంటనే తొలగించాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు
నిన్న కొంతసేపు కురిసిన వర్షానికి వంద పడకల ఆసుపత్రి కి పోయే దారిలో చెరువులను తలపించేలా నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సిన బాలింతలు, గర్భిణీలు వారి బంధువులు ఇబ్బందులు పడుతు వేలవల్సి వస్తుందాని కాబట్టి వెంటనే వర్షం నీరు తొలగించి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) బృందం వర్షం నీరు నిలిచిన ఉన్న పరిస్థితిని పరిశీలించి అందులో దిగి నిరసన వ్యక్తం చేశారు. పేషెంట్స్ బంధువులను ఆసుపత్రి కి తరలించడం.. ఆస్పత్రిలో ఉన్న వారిని బయటికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొద్దిపాటి వర్షానికి నీళ్లు నిలవడం తో పేషెంట్లు హాస్పటల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం నీరు చెరువులకు పోయే దారిని కాంట్రాక్టర్ మూసివేయడంతో ఈ సమస్య ఉత్పన్నం అయిందని పేర్కొన్నారు. వర్షంనిరు చెరువు కు వెళ్లే దారిలో అడ్డుగా కాంట్రాక్టర్ల మట్టిపొయడంతొ నీరు నిలిచిపోయిందని మట్టిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నీరు నిలవడానికి కారణమైన కాంట్రాక్టర్ పై సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే కాలువను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టర్, ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య, పొలం రాజేందర్, బొట్ల చక్రపాణి ,నాయకులు రజాక్ విరాట్ శ్రీ రాములు, రమేష్, తదితరులు పాల్గొన్నారు
వెంటనే దారిని ఏర్పాటు చేయాలి : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్
భూపాలపల్లిలో రియలేస్టేట్ వ్యాపారం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మండిపడ్డారు. వంద పడకల ఆస్పత్రి సమీపంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కొందరు కేటుగాళ్ళు అధికార పార్టీ నాయకులు. ప్రభుత్వ అధికారులతొ కలిసి రియల్ వ్యాపారానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి పక్కనే అటవీ ప్రాంతం నుండి వచ్చే వరద కాలువను కబ్జా చేసి వెంచర్ చేయడం వల్ల ఆస్పత్రి మొత్తం నీటి మయం అయిందని ఆయన అన్నారు. కల్యాణి వెంచర్ వల్ల వంద పడకల ఆస్పత్రికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని, అప్పుడు ఎలా ఉంటుందో అధికారులు అర్థం చేసుకోవాలన్నారు.