Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మెన్ ఆలం రామ్మూర్తి మరణం తీరనిలోటని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం గ్రామంలోని మేడారంలో అకస్మాత్తుగా రెండు రోజుల క్రితం గుండెపోటుతో మతి చెందిన అల్లం రామ్మూర్తి కుటుంబాన్ని పరామర్శించి సీతక్క మాట్లాడారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా 3 సార్లు పని చేసి, వన దేవతల జాతరను దేశం లోనే అతి పెద్ద జాతర గా గుర్తించడానికి ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం వారి కుటుంబానికి ప్రఘడ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసి సమాజంలో ఎదిగిన ఆదివాసి ఆణిముత్యాన్ని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్, మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, ఎండీ చాంద్ పాషా, సహకార సంఘం చైర్మెన్ పులి సంపత్గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, ఎంపీటీసీ ఏడు కొండల్, అనీల్ కుమార్, కష్ణ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు, మేడం రమణ కర్, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మేడారం జంపన్న వాగులో ముగ్గు గల్లంతైన ఏరియాను ఎమ్మెల్యే సీతక్క సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ములుగు జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్యతో ఫోన్లో మాట్లాడి గల్లంతైన మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో వెలికితీసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రిజ్వాన్ కుటుంబానికి సీతక్క పరామర్శ
ములుగు : ములుగు పట్టణ కేంద్రానికి చెందిన ఎండీ రిజ్వాన్ మంగళవారం ప్రమాదంలో మరణిం చగా వారి కుటుంబాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు ఏరియా హాస్పిటల్లో పరామర్శించారు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ ,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు, రమణకర్, కుతుబుద్దిన్, జాఫర్ పాల్గొన్నారు.