Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ క్షయ నిర్మూలన
- జాయింట్ డైరెక్టర్ రాజేశం
నవతెలంగాణ-ములుగు
2025 నాటికి ములుగు జిల్లాను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ అప్పయ్య అధ్యక్షతన మంగళవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యాధికారులకు, మ్యాచింగ్ బాచింగ్ సూపర్వైజర్లకు,సిబ్బందితో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 నాటికి టీబీ ఫ్రీ ఇండియాలో భాగంగా కొన్ని జిల్లాలను ఎంచుకున్నారని, ఇందులో ములుగు జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడానికి దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్ లో శ్వాసకోశ సంబంధమైన లక్షణాలు ఉన్న వారిని గుర్తించి క్షయ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. క్షయ నిర్ధారణ అయిన వారికి అదే రోజు ఆశ కార్యకర్తలు గాని, ఆరోగ్య కార్యకర్తల డాట్ ప్రొవైడర్స్‌తో గానీ చికిత్సను ప్రారంభించాలన్నారు ఆరోగ్య సిబ్బంది నిక్చెరు యాప్‌లో నిర్ధారణ అయిన ప్రతి కేసుల వివరాలతోపాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాలన్నారు. సంబంధిత క్షయ శాంపిల్స్‌ను ములుగు ఏరియా హాస్పిటల్‌కు పంపించాలన్నారు. డీబీపీ పద్ధతి ద్వారా రూ.500 బాధితుల అకౌంట్లో వేస్తారన్నారు. ప్రతి నెల రెండుసార్లు జిల్లాలో రివ్యూ మీటింగ్, ప్రతి నెల చివరి వారంలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించాలన్నారు. ప్రయివేటు ఆస్పత్రిలోని క్షయ కేసులకు సంబంధించి ఎస్ట్టీఎస్ మందులు అందించి చికిత్స గురించి వారికి వివరించాలన్నారు. ఆరోగ్య సాతి యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ క్షయ లక్షణాలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బందం, డాక్టర్ శ్రీ గన్న, స్నేహ శుక్ల, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ వాసు, టెక్నికల్ ప్లానింగ్ జితేందర్, డిప్యూటి డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, వైద్యాధికారులు, ఈస్ట్ మ్యాచింగ్ సూపర్వైజర్లు, డెమో నవీన్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.