Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కరోనా వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలి ముర్తుజా రిజ్వీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల నుండి హెలికాప్టర్లో వరంగల్ చేరు కున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హను మంతు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర , రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కోవిడ్, వ్యాక్సినేషన్ , సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నియంత్రణకు జ్వర సర్వేను మరింత పటిష్టంగా చేపట్టాలని తెలిపారు. ఆరోగ్య సిబ్బందితో పాటు గ్రామీణ ప్రాంతంలో పంచాయితీ సిబ్బందిని, పట్టణ ప్రాంతంలో కార్పోరేషన్ క్షేత్ర సిబ్బందిని బాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. వరంగల్, హైదరాబాద్ తరువాత అతి పెద్ద పట్టణమని, వరంగల్‌లో జనసాంధ్రత అధికంగా ఉండడం వల్ల కరోనా వ్యాప్తి కూడా సులభంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా టెస్ట్‌కు సంబందించిన యాప్ నమోదు చేశాకే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. జ్వర సర్వేలో గుర్తించిన వారికి ఐసోలేషన్ కిట్స్ అందించడం ద్వారా వారు ఆసుపత్రులలో చేరే అవసరం లేకుండా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఆరోగ్య శాఖ అదికారులు, టీచింగ్ ఆసుపత్రుల సూపరిం టెండెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కమలాపూర్, గోపాల్ పూర్, ముల్కనూర్ తదితర ప్రాంతంలో ప్రత్యేక దష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు .
అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాల కులు డాక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీల్లో జిల్లా సగటు కంటే ఎక్కవగా కేసులు నమోదు అవుతు న్నాయని అన్నారు. వైరస్ మరింత ప్రబల కుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసు కోవాలని అన్నారు. గత పది రోజుల్లో 1.6 పాజిటివ్ రేట్గా ఉన్న వరంగల్ అర్బన్ జిల్లాలో క్రమంగా 2కి చేరిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలిసిన వారి వివరాలను సేకరించాలని, వారికి కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఐసోలేషన్ లోనే ఉంచేవిదంగా చూడాలని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా టెస్ట్‌ల లక్ష్యం 6,600నుండి 12,000కు పెంచుతున్నట్లు, ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 300 ల నుండి 400 వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొదటి , రెండవ వేవ్ లను సమర్థవంతంగా నియంత్రించగలిగామన్నారు . మూడవ వేవ్ ను ఎదుర్కొనడానికి ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. టీచింగ్ ఆసుపత్రులు, వైద్య శాఖ, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఐసోలేషన్ సెంటర్‌ను కొనసాగించాలన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్డ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ... అన్ని వైద్య విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అసుపత్రులలో అడ్మిషన్ అయిన కేసుల ఏ ప్రాంతం నుండి అధికంగా వస్తున్నాయో గుర్తించి ఆ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అన్నారు. పిల్లల వైద్య విభాగంలో కావలసిన ఏర్పాట్లు తక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. టీిఎస్ఎంఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి, సీిఎంఓఎ డాక్టర్ టి గంగాధర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ కె లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ వి చంద్ర శేఖర్, కెయంసి ప్రిన్సిపల్ సంద్య జియం హెచ్ సూపరింటెండెంట్ సరళాదేవి , సీకేఎం సూపరింటెండెంట్ నిర్మల, ఐ హాస్పటల్ సూపరింటెండెంట్ గిరిధర్ రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్ మోహన్‌రావు , జిల్లా సర్వే లైన్స్ అధికారి ఏ శ్రీక్రిష్ణారావు , డిప్యూటి డీఎంహెచ్ఓ యాకూబ్ పాషా పాల్గొన్నారు.