Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురి అరెస్టు, పరారీలో ఒకరు తొర్రుర్ డీఎస్పీ వెంకటరమణ
నవతెలంగాణ-మరిపెడ
గుట్టు చప్పుడు కాకుండా నిషేదిత బెల్లాన్ని తరలిస్తున్న మూడు వాహనాలను మరిపెడ, సిరోల్ పోలీసులు పట్టుకుని ఏడు గురిని అరెస్టు చేశారు. మరిపెడ పోలీస ్‌స్టేషన్‌లో మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను తొర్రుర్ డీఎస్పీ వెంకటరమణ వెల్లడించారు. మంగళవారం సిరోల్ హెడ్ కానిస్టేబుల్ ఎస శ్రీనివాస్ కాంపెల్లి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వైపు వస్తున్న మిని లారీని ఆపి తనిఖీ చేయగా సుమారు 110బస్తాల నల్లబెల్లం, 1 క్వింటా పటిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి అందులో ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మరిపెడ పరిధి రాంపురం శివారులో అనుమానా స్పదంగా కనిపించిన ఓ ట్రాలీని తనిఖీ చేయగా 40బస్తాల నల్లబెల్లం, 2క్వింటాళ్ల పటిక ఉన్నట్లు గుర్తించి వాహనం సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదే క్రమంలో తానంచర్ల శివారులో సుర్యాపేట నుంచి మరిపెడకు వస్తున్న మరొక ట్రాలీని ఆపగా అందులో 20బస్తాల నల్లబెల్లం, 1క్వింటా పటిక ఉన్నట్లు గుర్తించి వాహనం సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మూడు ఘటనల్లో పట్టుకున్న బెల్లం విలువ సుమారు రూ.85లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వివరించారు. సిరోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడిన బెల్లం కేసులో పితల రత్న రాజు, మెడిదె రాజు తూర్పుగోదావరి జిల్లా, పేడూరి మల్లేష్, గుగులోత్ అశోక్ కురవి మండలంకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయగా, మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బానోత్ కష్ణ శనిగపురం, రాసం శెట్టి వెంకట సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా, వాంక్డోత్ మురళి సూర్యాపేటకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా సూర్యాపేటకు చెందిన వాంక్డోత్ ఉపేందర్ పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. భారీ మొత్తంలో బెల్లం పట్టుకున్నందుకు ఎస్ఐలు శ్రీనివాస్ రెడ్డి, భిక్షపతి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ క్రాంతి కుమార్, రంజిత్, విద్యాసాగర్‌లను డీఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.