Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ వినరుభాస్కర్
నవతెలంగాణ-హన్మకొండ
ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా వరంగల్ నగరంలో ఆటో భవన్ ఏర్పాటుకు కషి చేస్తున్నామ ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ వినరుభాస్కర్ అన్నారు. ఆదివారం ఆగస్టు 1వ తేదీన ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ఐక్యత ఆటో భవన్‌కు శ్రీకారం చుడు తుందన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఆటో భవన్ ఏర్పాటుతో ప్రత్యేక్షంగా పరోక్షంగా 20 వేల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చేయూత నంది స్తుందన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 30 నుంచి వారోత్స వాలు నిర్వహిస్తామని, కోవిడ్- 19 నిబంధనలకు లోబడి వారోత్సవాలు జరుపుకోవాలని సూచిం చారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మ దినోత్స వాన్ని పురస్కరించుకుని కోటి వక్షార్చాణలో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్ మూడు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మన తెలంగాణ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో జేఎన్ఎస్ స్టేడియం పునర్ ప్రారంభం
అంతర్జాతీయ క్రీడలకు వేదికకానున్న వరంగల్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) అన్ని హంగులతో పునర్ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ , పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్‌విప్ వినరుభాస్కర్ అన్నారు. ఆదివారం జేెఎన్ఎస్ స్టేడియంలో జరుగు తున్న అభివద్ధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కషితో అప్పటి ఎంపీ నిధుల నుంచి రూ.8 కోట్లు మంజూరు చేశామన్నారు. వాటితో త్వరలో సింతటిక్ ట్రాక్‌ను కూడా ప్రారంభించుకోనున్నామన్నారు. దీంతో జేఎన్ఎస్ స్టేడియం అంతర్జాతీయ క్రీడలకు కేంద్రం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సాహిస్తుం దని, రాష్ట్ర నలుమూలల నుండి జెఎన్ఎస్ స్టేడియంకు క్రీడాకారులు వస్తుంటారని, పునర్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ అజీజ్ ఖాన్, కుడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.