Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీిఆర్ఎస్, బీజేపీ దొందూ దొందే...
- సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలిగంటి రత్నమాల
నవతెలంగాణ- ఖిలా వరంగల్
పెంచిన ఇంటి పన్నుతోపాటు, చెత్త పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలిగంటి రత్నమాల డిమాండ్ చేశారు. ఆదివారం 40వ డివిజన్ బీరన్న కుంటలో పార్టీ రెండవ మహాసభ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పార్టీ జెండా ఆవిష్క రించి మాట్లాడారు. పేదల ప్రభుత్వమని చెబుతూనే టీఆర్ఎస్ ఇంటి పన్ను, చెత్త పన్నులు విపరీతంగా పెంచి దోచుకుంటున్నదని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆగడాలు రోజుకి మితిమీరిపోతు న్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటే పన్నులు పెంచడమేనా అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన వాగ్ధానాలు విస్మరించి ప్రజలపై భారాలు మోపడం హేయమైన చర్యని విమర్శిం చారు. టీఆర్ఎస్, బీజేపీ దొందు దొందేనని మండి పడ్డారు. ప్రజల క్షేమానికి పెంచిన ఇంటి పన్ను, చెత్త పన్నులను ఉపసంహరించుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో కరిమాబాద్ ఏరియా కార్యదర్శి ముక్కెర రామస్వామి, అలువాల అంజయ్య, వెంక్కటయ్య, బొల్లం యాకయ్య, రాదక్కా, ఎండీ ఉస్సేన్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.