Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులపై అవగాహన కల్పిం చేందుకు వెళ్తున్న ఉపాధ్యాయుడు బావిలో పడి మృతి చెందిన సంఘటన ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామంలో అదివారం చోటుచేసుకుంది. ఎసైస నండ్రూ సాయిబాబు కథనం ప్రకారం... మనుబోతుల గడ్డ గ్రామ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎండీ అన్వర్ పాష(47) నర్సంపేట పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఆన్ లైన్ క్లాసులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మనుబోతులగడ్డ నుండి బండ మీది మామిడి తండాలోని విద్యార్థుల వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. గ్రామశివారులో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయబావిలో అదుపుతప్పి బైక్ తో సహ పడిపో యాడు. ఆ సమయంలో ఎవరు గమనించకపోవడంతో మృతి చెందాడు. అటువైపుగా వెళ్ళిన స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. నర్సంపేట రూరల్ సీఐ సతీష్ ,ఖానాపురం ఎసైస నండ్రూ సాయీబాబు ఘటన స్థలానికి చేరుకుని మతదేహన్ని, బైక్ ను బయటకు తీశారు. మృతుని భార్య హఫీజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉపాధ్యాయుడి మృతి పై అనుమానాలు !
మనుబోతులగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఎస్ జీటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అన్వర్ పాష మత్యువాత పడడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అన్లైన్ తరగతుల బోధన నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడు అన్వర్ పాష శుక్రవారం డ్యూటికి హాజరు కావాల్సి ఉంది. హజరుకాలేకపోతున్నట్లు హెచ్ఎంకు సమాచారం ఇవ్వడంతో మరో ఇద్దరు ఉపాధ్యాయులు హాజరైయ్యారు. పాఠశాలకు శనివారం రోజు సైతం విధులకు హజరుకాలేదు. ఇంతకీ మిస్టరీ ఏమీటంటే అదివారం సెలవు రోజున పాఠశాలకు పక్క గ్రామమైన బండమీదిమామిడి తండాకు ఎందుకు వెళుతున్నట్టు పలువురు అనుమానం వ్యక్తపరిచారు. అగ్రామం వైపు రావడం ,బావిలో బైక్ తో సహా పడి మత్యువాత పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆత్మహత్యనా ?ఇంకేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు సమగ్రవిచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని పలువురు కోరుతున్నారు.