Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న తమ సాగు భూములను అటవీశాఖ అధికారులు ఆటవీభూములన్న నెపంతో బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆవేదన,ఆందోళనల మధ్య ఓ గిరిజన రైతు ఆదివారం ఉదయం గుండెనొప్పి తో మతి చెందిన విషాద సంఘటన మంగపేట మండలంలోని లక్ష్మీ నరసాపురం గ్రామంలో చోటుచేసుకుంది. 40 ఏండ్లుగా మండలంలోని లక్ష్మీనరసాపురం, వాగొడ్డుగూడెం, రాజుపేట, కన్నాయిగూడెం, గిరిజన, దళిత, ఇతర బడుగువర్గాల పేదలు వందలాది పోడు చేసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో కొద్దిమందికి ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు కూడా వచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు వాటిని లెక్క చేయకుండా,ఇటీవల కందకాలు వేయటం వేసుకున్న పంటలను ట్రాక్టర్లతో చెడకొట్టడం, ఇతరత్రా ధ్వ%శీ%సం చేయడం జరుగుతుంది. ఐటిడిఎ పి.ఓ కి కూడా రైతులు కలవడం తో ఇటు రైతులు ఫారెస్ట్ అధికారులు పిలిపించి ప్రత్యేక అధికారి నియమించి దర్యాప్తు జరుపుతామని తెలపడంతో రెవెన్యూ అధికారులు ఒక ఫారెస్ట్ అధికారులు మాత్రమే పిలిచి రైతులను పిలవకుండా తుప్పలు, చిన్న, చిన్న చెట్లు ఉన్న వైపు ఫోటోలుతీసుకువచ్చి ఐ.టి.డి.ఏ పి.ఓ ను తప్పు తోవ పట్టించి గతవారం రోజులుగా భయభ్రాంతులు గా గురిచేసి రైతులను పోలీసు స్టేషన్ కు రమ్మని చెపుతూ, అటవీశాఖ అధికారులు మాత్రం ట్రాక్టర్లు,డోజర్ లు తీసుకువెళ్లి,పోడు భూముల్లో వేసిన పంటలను ధ్వంసం చేసి నాగళ్లు వేయడంతో మనస్థాపానికి గురి అయిన సున్నం పాపయ్య ఆదివారం అందరితో ఇంకా మన భూములు దక్కవు అంటూ పలువురితో చెపుతూ చాతిలో నొప్పి వస్తుంది అని అనడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాపయ్య మరణించాడు. పాపయ్య మరణానికి కారకులైన ఫారెస్ట్ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఫారెస్ట్ దాడులు ఆపివేయాలని వాళ్ళ భూముల జోలికి వెళ్లొద్దని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు దావుద్, ప్రసాద్, తుమ్మల వెంకట్రెడ్డి, తోకల రవి, మండల నాయకులు ముత్యాలు, సీతయ్య, ఈశ్వరమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.