Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మండ రాజన్న డిమాండ్ చేశారు. మండలంలోని కాకతీయ నగర్, రంగాపురం గ్రామాల్లో జలగం పెద్ద యాకయ్య, పుసులూరి నర్సింహారావు అధ్యక్షతన ఆదివారం శాఖ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న పార్టీ జెండా ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించి మాట్లాడారు. పార్టీ నిర్మాణం, స్థానిక సమస్యలపై సభ్యులు దష్టి పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ఈదుల చెరువు అన్యాక్రాంతం అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చెరువులోనే ఉపాధి హామీ పథకం కింద ఏండ్లు గడుస్తున్నా పూడికతీత పనులు అయిపోలేదని చెప్పారు. ఈదుల చెరువు బయ్యారం పెద్ద చెరువు ద్వారా కాలువ నిర్మాణం లేదన్నారు. రహదారి కూడా లేకపోవడం వల్ల చెరువు కింద ఉన్న రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. అలాగే వైకుంఠధామం మార్గంలో ఇరువైపులా రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ప్రయాణించాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. అనంతరం రంగాపురం శాఖ కార్యదర్శిగా తోడుసు యాదగిరి, కాకతీయనగర్ శాఖ కార్యదర్శిగా కపిల్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.