Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యనిర్వాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా భాస్కర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నా ఆ మేరకు రాష్ట్ర ప్రభ్తువం స్పందించడం లేదని మండిపడ్డారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఇతర పార్టీలు పట్టించుకోకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. దీన్ని అధిగమించడానికి రానున్న రోజుల్లో బూత్ కమిటీ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. మండలంలో పలు ప్రధాన అంశాలపై తీర్మానాలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి చౌగాని స్వప్న, ప్రచార కార్యదర్శి రుద్రారపు సురేష్, సీనియర్ నాయకులు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు, సూరపనేని వెంకట సురేష్, మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, వడ్లకొండ యాకయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వీరభిక్షం, మండల ఉపాధ్యక్షుడు బూర్గుల, కందాల రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.