Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్
నవతెలంగాణ-గూడూరు
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ అన్ని గ్రామాల్లో కార్య కర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ అనుబంధ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కోరారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో మండల అధ్యక్షుడు వాంకుడోత్ మోతీలాల్ అధ్యక్ష తన ఆదివారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి హుస్సేన్ నాయక్ హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వంని ప్రజా ప్రతినిధులు అధికారులతో కుమ్మక్కై తెరచాటు రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. మహబూబాబాద్‌కు మంజూరైన గిరిజన యూనివర్సిటీ అసమర్ధ నాయ కుల వల్ల ములుగు ప్రాంతానికి తరలిపోయిందని చెప్పారు. జిల్లా కేంద్రంలో మూడేండ్ల క్రితమే మెడికల్ కాలేజీ మంజూరు కాగా అధికార పార్టీ ప్రజా ప్రతి నిధులు చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి అనంతరమే ప్రకటించారని చెప్పారు. భీముని జలపాతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేటికీ నిధులు మంజూరు చేయలేదన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సహకారంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తానని చెప్పారు. వచ్చే నెల 9 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజరు తలపెట్టిన పాదయాత్రలో ఉత్సాహవంతులు పాల్గొనాలని కోరారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రాంచందర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాచకొండ కొమరయ్య, బీజేవైఎం అధికార ప్రతినిధి మదన్, మండల ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన కార్యదర్సులు వల్లభు వెంకటేశ్వర్లు, చెల్పూరి వెంకన్న, నాయకులు మెరెడ్డి సురేందర్, సమ్మెట సుధాకర్, సర్పంచ్ మాలోత్ సునీత భావుసింగ్ నాయక్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవి సింగ్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.