Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న గ్రామస్తులు, నాయకులు
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని కంబాలపల్లి మాజీ సర్పంచ్, న్యూడెమోక్రసీ నాయకుడు మోకాళ్ల మురళీకృష్ణను అరెస్ట్ చేసేందుకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఆదివారం విఫలయత్నం చేశారు. మండలంలోని కొత్తూరు, పందిపంపుల గిరిజనుల సాగు భూముల్లో మొక్కలు నాటుతున్న క్రమంలో అడ్డుకుంటున్న గిరిజనులకు, పోలీసులకు మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటుండగా అందుకు కారకుడుగా భావిస్తూ మురళీకృష్ణ, అతడి ట్రాక్టర్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసు, అటవీ శాఖల అధికారులు యత్నించారు. ఈ నేపథ్యంలో అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుత రామారావు ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు పోలీసులను, అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. రెండు గ్రామాల ప్రజలను బయటకు రానీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు కూలీలను తీసుకువెళ్తుండగా పందిపంపులో ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మురళీకష్ణను అదుపులోకి తీసుకునేందుకు పూనుకొన్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
మండల కేంద్రంలో నిరసన
మండలంలోని కొత్తూరు రైతుల భూముల్లో హరితహారాన్ని అడ్డుకున్నందుకు మహిళలపై, రైతులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మండల కేంద్రం లో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అచ్యుత రామారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడారు. దశాబ్దాలుగా సాగు చేసు కుంటున్న భూముల్లో మొక్కలు నాటడం ఆదివాసీల కడుపుకొట్టడమేనని విమర్శిం చారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు జడ సత్యనారాయణ, దేశెట్టి రామచంద్రయ్య, మురళీక్రిష్ణ, పద్మ, రామగిరి భిక్షం, తుడుం వీరభద్రం, నర్సింహ, యుగంధర్, తారాచంద్, మురళీ, శేషు తదితరులు పాల్గొన్నారు.