Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పులేందర్
- సంఘం తొర్రూరు కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-తొర్రూరు
కళాకారుల సంక్షేమానికి కషి చేస్తానని తొర్రూర్ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కస్తూరి పులేందర్ తెలిపారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో కళాకారులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కళాకారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చొరవ తీసుకుంటానని తెలిపారు. అనంతరం అసోసియేషన్ తొర్రూర్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కస్తూరి పులేందర్, ఉపాధ్యక్షుడుగా ఉమాకర్ వంశీ, వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రవణ్ కుమార్ పారిపల్లి, ప్రధాన కార్యదర్శిగా సతీష్ మార్గం, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రేగొండ రామకృష్ణ, కోశాధికారిగా రాగి ఈశ్వర్ప్రసాద్, సహాయ కార్యదర్శులుగా గుగులోత్ రమేష్, గద్దల అనిత్, ప్రచార కార్యదర్శులుగా మహేష్ చంద్ర, దిలీప్ రెడ్డబోయిన, ముఖ్య సలహాదార్లుగా శ్రీధర్, నిరంజనచారి, సుదర్శన్, బ్రహ్మచారి, కిరణ్రాజ్, కార్యవర్గ సభ్యులుగా సుమంత్, భరత్, వివేక్, రఘు, నరేందర్, మణి, సాయి, అఖిల్, రాజేష్, అద్వైత్, బంటీ ఎన్నికయ్యారు.